మంచి అలవాట్లు :
* రోజుకు ఎనిమిది గంటలు నిద్రపోవాలి.* లేచిన వెంటనే పక్క బట్టలు తీయటం.
* విద్య చెప్పిన వారిని మరువరాదు.
* వేకువ(తెల్లవారు) జామునే లేవటం.
* వేళకు బడికి (స్కూల్‌కి) వెళ్ళటం.
* శుభ్రంగా క్రింద పడకుండా పలహారం(టిఫిన్) తినటం.
* శుభ్రంగా పళ్ళు తోముకోవటం.
* శుభ్రమైన బట్టలు ధరించటం.
* సజ్జనులతో స్నేహము చేయవలెను.
* సాటి విధ్యార్ధితో స్నేహ భావంతో మెలగటం.
* స్వామి యందు భక్తి నుంచుము.
* బడికి వెళ్ళటానికి పది నిమిషాల ముందే కావలసినవన్ని సంచిలో (Bag) సర్దుకోవాలి .
* బడికి వెళ్ళేటప్పుడు బూట్లను శుభ్రంగా తుడుచుకొని బూట్లను వేసుకోవాలి .
* బీదలను చూసి హేళన చేయవద్దు .
* బూట్లను శుభ్రంగా ఉంచుకోవాలి .
* భోజనం చేసే ముందు చేతులు కడుక్కోవటం .
* భోజనం చేసే ముందు వస్తువులను (గిన్నెలను) తీసుకురావటానికి అమ్మకు సాయం చేయటం .
* మంచి అలవాట్లకు మించిన ధనం లేదు .
* మంచిని మించిన గుణం లేదు .
* మనిషికి మాటే అలంకారం .
* మాట వెండి, మౌనం బంగారం .
* నీళ్ళు పట్టు కోవటం అయిన వెంటనే పంపు కట్టేయాలి .
* నీళ్ళు వృధా చేయవద్దు .
* నోరు మంచిదయితే, ఊరు మంచిదవుతుంది .
* పరనింద పనికిరాదు .
* పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవటం .
* పుస్తకాలను చక్కగా సర్దుకోవాలి .
* పెద్ద వాళ్ళు వచ్చినప్పుడు లేచి నిలబడటం .
* పెద్దల మాటలు వినవలెను .
* పెద్దలను గౌరవించాలి .
* పేదల మీద దయ ఉంచవలెను .
* చెడ్డవారి చెలిమి చేయరాదు .
* చేసిన మేలు మరువరాదు .
* జీవహింస చేయరాదు .
* టి వి చూసేటప్పుడు టి వి కి దగ్గరగా కూర్చోవద్దు .
* తనను తాను పొగడు కొనరాదు .
* తల్లిదండ్రులను కష్ట పెట్టరాదు .
* తిన్న వెంటనే పళ్ళు తోముకోవటం .
* తొందరపడి ఏ పనీ చేయరాదు .
* నమ్మిన వారిని మోసం చేయరాదు .
* నిప్పుతో లేక అగ్గిపుల్లలతో ఆడకూడదు .
* ఉపాధ్యాయులను గౌరవించటం .
* ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలు, మంచి మాటలు నేర్చుకోవటం .
* ఎల్లప్పుడూ దైవచింతన చేయుము .
* ఏదైన తిన్న తరువాత కాగితాలను, తొక్కలను చెత్తకుండీలో (Dust Bin) వేయాలి .
* ఒకరి మీద చాడీలు చెప్పరాదు .
* కరెంటు వైర్లతో, స్విచ్చులతో, ప్లగ్గులతో ఆడకూడదు .
* ఖాళీ సమయాల్లో బొమ్మలు గీయటం, చిన్న చిన్న కథలు చదవటం వంటివి చేయటం .
* గురువుల మాట వినాలి .
* గ్యాస్ పొయ్యితో (బర్నర్‌తో) ఆడకూడదు .
* చక్కగా తల దువ్వు కోవటం .
* అమ్మకి చిన్న చిన్న పనులలో సాయంచేయటం.
* అసత్యం ఆడకూడదు.
* ఆకలిగొన్న వానికి అన్నము పెట్టుము.
* ఆటలాడుచోట, అలుక పూనరాదు.
* ఆడిన మాట తప్పరాదు.
* ఆడుకున్న తరువాత ఆట వస్తువులను సర్దుకోవాలి.
* ఇంటి పని (హోం వర్క్) అయిన తర్వాతనే ఆడుకోవాలి.
* ఇంటి పని (హోం వర్క్) సరిగ్గా చేయటం.
* ఇంటికి వచ్చిన వారిని గౌరవించటం.
* ఇంటిలోకి వచ్చే ముందు కాళ్ళు శుభ్రంగా తుడుచుకొని రావాలి.