Saturday 28 January 2017

మరి కొన్ని తెలుగు మంచి మాటలు

-->

  1. ప్రతి రాయిలోను ఒక శిల్పం దాచుకొని ఉంటుంది. సుత్తితో బద్దలు కొడితే శిల్పం రాదు.. ఉలి తొ చెక్కాలి. అప్పుడే ఆ రాయిలోనుంచి అపురూపమైన శిల్పం బయటపడుతుంది.. అలాగే ప్రతి మనిషి జీవితం లొ అతీతమైన శక్తి దాగుంటుంది. దాన్ని ఎప్పుడైతె గుర్తిస్తామో మనమంటే ఏమిటో నిరూపించుకోవచ్చు..
  2. జీవితం అంటే అర్దం-పరమార్దం; ఈ రెండు కలిస్తేనే జీవితం. మనిషి పుట్టడం అర్దం, జీవించడం పరమార్దం.
  3. ఆకలేస్తుంది అని అన్నం తినడం ప్రకృతి; ఆకలేస్తుంది అని ఎదుటివాడిని దోచుకొని తినడం వికృతి; ఆకలేస్తుంది అని ఎదుటివారికి పెట్టి తినడం సంస్కృతి.
  4. లక్ష్యం అని నిర్దేశించుకున్నాక అది సాధించే తీరాలి. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఎదురొడ్డి నిలవడమే కాని తలొగ్గి మడమ తిప్పవద్దు.
  5. మెరుగు పెట్టకుండా రత్నానికి, కష్టాలు ఎదుర్కోకుండా మనిషికి గుర్తింపు రాదు.
  6. ఆత్మ విశ్వాసంతో ఆశించేదేదైనా నిత్య జీవీతంలొ నిజమౌతుంది.
  7. జీవితం లొ సర్వం కోల్పోయినా ఒకటి మాత్రం మిగిలే ఉంటుంది, అదే భవిష్యత్తు.
  8. పూలలొ సువాసన, మనిషిలొ యోగ్యత దాచినా దాగవు.
  9. అవకాశం రావడం గొప్ప కాదు, అవకాశం నిరూపించుకోవడం గొప్ప .
  10. ఆలోచన వికసించే పుష్పం, ఆలాపన దానికి అంకురం, ఆచరణయే ఫలం.
  11. వైఫల్యం నిరాశకు కారణం కాకుడదు, క్రొత్త ప్రేరణకు పునాది కావాలి.
  12. వెలిగే దీపమే ఇతరులను వెలిగించగలదు, నిరంతరం నేర్చుకునేవారే ఇతరులకు నేర్పగలరు.
చివరగా మరొకటి,
  • సద్వచనాలు విని ప్రయోజనం లేదు. వాటిని నిత్యజీవితంలో ఎంతవరకు ఆచరణలోనికి తెస్తున్నామనేదే ముఖ్యం.